జమ్మూకశ్మీర్ లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. ఐదుగురు ఉగ్రవాదుల అరెస్ట్!
- కశ్మీర్ లోని షోపియాన్ లో ఘటన
- నిఘావర్గాల సమాచారంతో మెరుపుదాడులు
- బలగాల కాన్వాయ్ పై దాడికోసం ఐఈడీని తయారుచేసిన ఉగ్రవాదులు
ఈ సందర్భంగా హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన ఐదుగురు ఉగ్రవాదులను భద్రతాబలగాలు సజీవంగా పట్టుకున్నాయి. భూమిలో అమర్చడానికి సిద్ధం చేసిన శక్తిమంతమైన ఐఈడీ(అత్యాధునిక పేలుడు పదార్థం)ని స్వాధీనం చేసుకున్నారు. భద్రతాబలగాలు రాకపోకలు సాగించే రోడ్డుపై ఈ ఐఈడీని అమర్చేందుకు ఉగ్రమూకలు కుట్ర పన్నాయని ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పక్కా నిఘా సమాచారంతో ఈ కుట్రను భగ్నం చేశామని పేర్కొన్నారు.