తప్పుడు ప్రచారం ఆపకుంటే కాంగ్రెస్ నేతలను ప్రజలు తరిమికొడతారు!: ఎర్రబెల్లి హెచ్చరిక
- కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు
- ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు స్టేలు తెచ్చారు
- హైదరాబాద్ లో మీడియాతో టీఆర్ఎస్ నేత
ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కాంగ్రెస్ నేతలు కోర్టులకు వెళ్లారనీ, కాలువల తవ్వకంపై స్టేలు తీసుకొచ్చి పనులను ఆలస్యం చేశారని మండిపడ్డారు. అలాగే శ్రీరాం సాగర్ ప్రాజెక్టులో నీళ్లు రాకపోవడానికి కాంగ్రెస్ నేతలే కారణమని దుయ్యబట్టారు.కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేసి ప్రజలను మోసం చేయవద్దని ఎర్రబెల్లి హితవు పలికారు. ఇలాగే అబద్ధాలు చెబితే కాంగ్రెస్ నేతలను గ్రామాల్లో ప్రజలు తరిమికొడతారని హెచ్చరించారు.