India: భారత కంపెనీలకు అమెరికా కఠిన హెచ్చరిక!

  • ఇండియా ద్వారా హువావేకు టెక్నాలజీ
  • తమ సాంకేతికతను బదిలీ చేయరాదని హెచ్చరిక
  • కంపెనీలే చర్యలు చేపట్టాలని సూచన

భారత కంపెనీలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన హెచ్చరికలు జారీ చేశారు. తమ దేశం నుంచి ఇండియా దిగుమతి చేసుకునే వస్తువులు లేదా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల గురించిగానీ, సాంకేతిక సమాచారం గురించిగానీ చైనాకు చెందిన కంపెనీలతో పంచుకోవద్దని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ ఉత్పత్తుల సంస్థ హువావేతో ఏ విధమైన సంబంధాలూ పెట్టుకోరాదని ఆయన అన్నారు.

హువావేతో అమెరికా సర్కారు వాణిజ్య యుద్ధం చేస్తున్న సమయంలో అమెరికన్ టెక్నాలజీ, ఇండియా ద్వారా హువావేకు చేరుతోందని యూఎస్ ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం ఇవ్వడంతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హువావే భారత్ లో నిర్వహిస్తున్న వ్యాపార లావాదేవీలపై ఓ కన్నేసి ఉంచాలని, ఇండియాలో ఆ సంస్థ టెక్నాలజీ ల్యాబ్ లను నిర్వహిస్తుంటే తనఖీలు జరిపి యూఎస్ సాంకేతికత అక్కడ వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ట్రంప్ అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కన్నా, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కంపెనీలే చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. 

More Telugu News