ప్రముఖ మోడల్ రోడ్డుపై వెళుతుంటే లైంగిక వేధింపులు!
- గత రాత్రి కోల్ కతాలో ఘటన
- స్నేహితురాలితో కలిసి క్యాబ్ లో వెళుతుండగా యాక్సిడెంట్
- చుట్టుముట్టి వేధించిన బైకర్లు
అంతే.. క్షణాల వ్యవధిలో పది మంది బైకర్లు వారి కారును చుట్టుముట్టారు. డ్రైవర్ ను వదిలేసి, ఆమెను వేధించారు. ఈ విషయాన్ని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. బైకర్లను గుర్తించి అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ కేసులో షేక్ రాహిత్, ఫర్దీన్ ఖాన్, షేక్ ఘని, షేక్ షబ్బీర్ అలీ, షేక్ వాసిం, షేక్ ఇమ్రాన్ అలీ, అతీఫ్ ఖాన్ లను నిందితులుగా గుర్తించి, వారిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్టు తెలిపారు.