Jagan: వైఎస్ జగన్ కోసం హెలికాప్టర్... ట్రయల్ రన్ వేసిన అధికారులు!

  • జగన్ ఇంటికి అరకిలోమీటర్ దూరంలో హెలీపాడ్
  • పాత ప్యారీ కంపెనీ స్థలంలో ఏర్పాటు
  • టేకాఫ్, ల్యాండింగ్ లను పరిశీలించిన అధికారులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోసం హెలీపాడ్ సిద్ధమైంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్ నివాసానికి సమీపంలోనే దీన్ని ఏర్పాటు చేసిన అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. జగన్ నివాసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి ఇది అర కిలోమీటర్ దూరంలో ఉంది. సమీపంలోని పాత ప్యారీ కంపెనీ స్థలంలో నూతన హెలీపాడ్ ను సిద్ధం చేసిన అధికారులు, జగన్ ప్రయాణాలు సాగించే హెలికాప్టర్ ను నిన్న రెండు మూడు సార్లు ల్యాండింగ్, టేకాఫ్ చేశారు. ఈ ప్రాంతంలో హెలికాప్టర్ దిగేందుకు, ఎగిరేందుకు సులువుగానే ఉందని అధికారులు తెలిపారు.
Jagan
Helepad
Tadepalli
Trail Run

More Telugu News