Ranveer Singh: పాక్ క్రికెట్ అభిమానిని దగ్గరకు తీసుకుని ఓదార్చిన రణ్‌వీర్.. ప్రశంసల జల్లు కురిపిస్తున్న నెటిజన్లు

  • పాక్ ఓటమిని భరించలేకపోయిన అభిమాని
  • అతడిని ఓదార్చి.. సెల్ఫీ దిగిన రణ్‌వీర్
  • మళ్లీ ఫాంలోకి వస్తారంటూ ధైర్యం చెప్పిన హీరో

పాక్ క్రికెట్ అభిమానిని రణ్‌వీర్ దగ్గరకు తీసుకుని ఓదార్చుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు రణ్‌వీర్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇటీవల ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్ కప్‌లో భాగంగా జరిగిన భారత్ - పాక్ మ్యాచ్‌లో పాక్ చిత్తుగా ఓడిపోవడాన్ని చూసిన ఓ పాక్ అభిమాని భరించలేకపోయాడు. స్టేడియంలోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు.

అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ అతన్ని దగ్గరకు తీసుకుని ఓదార్చడమే కాకుండా అతనితో కలిసి ఓ సెల్ఫీ కూడా దిగాడు. మరో అవకాశం ఉందిలే బాధపడకని ధైర్యం చెప్పాడు. పాక్ బాగా పోరాడిందని.. క్రికెటర్లు కూడా నిబద్ధతతో ఉన్నారని, మళ్లీ ఫాంలోకి వస్తారంటూ రణ్‌వీర్, పాక్ అభిమానిని ఓదార్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు అసలైన హీరో రణ్‌వీర్ అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.  

  • Loading...

More Telugu News