Sharwanand: శర్వానంద్ భుజం ఎముక విరిగి ఐదారు ముక్కలైంది: డాక్టర్ గురవారెడ్డి

  • భుజం గాయం అత్యంత తీవ్రమైనది
  • శర్వానంద్ కాలికి తగిలిన గాయం చిన్నదే
  • మరో రెండ్రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాం

థాయ్ లాండ్ లో స్కై డైవింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడిన టాలీవుడ్ హీరో శర్వానంద్ కు హైదరాబాద్ లోని సన్ షైన్ హాస్పిటల్ లో శస్త్రచికిత్స నిర్వహించిన సంగతి తెలిసిందే. శర్వానంద్ కు సర్జరీ చేసిన వైద్యుల్లో సన్ షైన్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ గురవారెడ్డి కూడా ఉన్నారు. శర్వానంద్ ఆరోగ్యపరిస్థితిపై ఆయన మీడియాకు వివరాలు తెలిపారు. శర్వాతో తనకు పదిహేనేళ్ల అనుబంధం ఉందని, అతడిని తమ కుటుంబంలో ఓ వ్యక్తిగా భావిస్తుంటానని వెల్లడించారు.

"శర్వానంద్ కు తగిలిన గాయాలు ఎముకలకు సంబంధించినవి కావడంతో ఆపరేషన్ కు గంటల కొద్దీ సమయం పట్టింది. కాలికి తగిలిన గాయం చిన్నదే కానీ, భుజం ఎముకకు తగిలిన గాయం అత్యంత తీవ్రమైనది. ఆ ఎముక విరిగి ఐదారు ముక్కలైంది. గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయడానికి మాకు ఐదు గంటల సమయం పట్టింది. మరో రెండ్రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాం, త్వరగానే కోలుకుంటాడు" అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News