Andhra Pradesh: ఏపీ ఉభయసభలు నిరవధిక వాయిదా

  • ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ ఉభయసభల్లో తీర్మానం
  • ఐదు రోజుల పాటు సాగిన అసెంబ్లీ సమావేశాలు  
  • ఈ ఐదు రోజుల్లో ప్రసంగించిన మొత్తం సభ్యుల సంఖ్య 175 

ఏపీ ఉభయసభలు నిరవధిక వాయిదా పడ్డాయి. ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం లభించింది. అనంతరం, సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. అదే విధంగా, ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ శాసనమండలిలోనూ తీర్మానం చేశారు. ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి ఆమోదం లభించింది. అనంతరం శాసనమండలి నిరవధిక వాయిదా పడింది. కాగా, అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల పాటు జరిగాయి. ఈ ఐదు రోజుల్లో శాసనసభ సమావేశాలు నిర్వహించిన మొత్తం సమయం 19 గంటల 25 నిమిషాలు కాగా, మొత్తం 175 మంది సభ్యులు ప్రసంగించారు.

More Telugu News