పాకిస్థాన్ నటి వీణా మాలిక్ కు ఘాటుగా కౌంటర్ ఇచ్చిన సానియా మీర్జా
- కొడుకుని హుక్కా బార్ కు తీసుకెళ్లడం దారుణమన్న వీణా మాలిక్
- నా కొడుకుని ఎక్కడకూ తీసుకెళ్లలేదన్న సానియా
- ఈ విషయాలన్నీ మీకు అనవసరమంటూ వ్యాఖ్య
వీణా వ్యాఖ్యలకు సానియా మీర్జా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. తన కుమారుడిని తాను ఎక్కడకూ తీసుకెళ్లలేదని... అయినా ఈ విషయాలన్నీ మీకు అనవసరమని చెప్పింది. తన కుమారుడిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటానో తనకు మాత్రమే తెలుసని వ్యాఖ్యానించింది. పాకిస్థానీ క్రికెటర్లు ఏం తింటారో పట్టించుకోవడానికి తాను పాక్ క్రికెట్ టీమ్ డైటీషియన్ కాదని ఎద్దేవా చేసింది. వారి తల్లిని కాదని, టీచర్ ను అంతకన్నా కాదని చెప్పింది.
ఆదివారం భారత్ తో జరిగిన మ్యాచ్ లో పాక్ ఘోరంగా ఓడిపోయింది. దీంతో, సానియా మీర్జాపై పాకిస్థాన్ కు చెందిన పలువురు నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు.