Yanamala: అసెంబ్లీలో తారసపడ్డ జేసీతో... 'అంతా మీవల్లే' అన్న యనమల!

  • అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికరమైన ఘటనలు
  • ఎదురెదురుపడ్డ యనమల, జేసీ
  • మీవల్లే నష్టం జరిగిందన్న యనమల
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికరమైన ఘటనలు జరుగుతున్నాయి. నిన్న బాలకృష్ణ, రోజాలు పరస్పరం ఎదురుపడి పలకరించుకోగా, ఈ ఉదయం ఎమ్మెల్యే ఆర్కే, నారా లోకేష్ లు ఒకరికి ఒకరు తారసపడ్డారు. తాజాగా, యనమల రామకృష్ణుడు, జేసీ దివాకర్ రెడ్డి ఎదురెదురు పడగా, వారిద్దరి మధ్యా ఆసక్తికర సంభాషణ జరిగింది.

యనమలను పలకరించిన జేసీ, "రాయలసీమపై కోపం తగ్గిందా?" అని ప్రశ్నించారు. దీనిపై యనమల స్పందిస్తూ "మొత్తం మీరే చేశారు. మీ వల్లే నష్టం జరిగింది" అని ఒకింత ఘాటుగానే సమాధానం ఇచ్చారు. వీరిద్దరి సంభాషణను దగ్గరుండి చూసిన తెలుగుదేశం పార్టీ నేతలు, వీరి వైఖరిపై కొత్త చర్చకు తెరలేపారు. కాగా, గత రెండు రోజులుగా అమరావతిలోనే ఉన్న జేసీ దివాకర్ రెడ్డి, నిన్న బీజేపీలో చేరికపై జరుగుతున్న ప్రచారంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
Yanamala
JC
Assembly

More Telugu News