Ramgopal Varma: వీళ్లు ఎమ్మెల్యేలా? స్కూలు పిల్లలా?: రామ్ గోపాల్ వర్మ సెటైర్!

  • స్కూలు విద్యార్థులు గుర్తుకొస్తున్నారు
  • స్పీకర్ పదేపదే బెల్ మోగించాల్సి వస్తోంది
  • ట్విట్టర్ లో రామ్ గోపాల్ వర్మ
ఆంధ్రప్రదేశ్ శాసనసభ జరుగుతున్న తీరుపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెటైర్లు వేశారు. తాను అసెంబ్లీ సమావేశాలను చూస్తుంటే స్కూలు విద్యార్థులు గుర్తుకొస్తున్నారని అన్నారు. "స్పీకర్ పదేపదే బెల్ ను మోగిస్తున్నారు. అలా చేయక తప్పదనుకుంటాను. ఎందుకంటే ఎమ్మెల్యేలు స్కూలు పిల్లల్లా వ్యవహరిస్తున్నారు" అని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో వర్మ ఓ ట్వీట్ ను పెట్టారు. కాగా, అసెంబ్లీ సమావేశాలు గత వారంలో ప్రారంభం కాగా, తొలి సమావేశాల్లోనే వాడివేడి చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అధికార విపక్ష ఎమ్మెల్యేల మధ్య ప్రతి క్షణం ఏదో ఓ విషయంలో వాగ్వాదం జరుగుతూనే ఉండటం గమనార్హం. 
Ramgopal Varma
Twitter
Speaker
Bell

More Telugu News