allari subhashini: మొదటి సినిమాలో అలా అవకాశం వచ్చింది: 'అల్లరి' సుభాషిణి

  • మా సొంతవూరు భీమవరం
  • నాటకాల పట్ల ఆసక్తి ఎక్కువ
  •  మొదటి సినిమా 'అల్లరి'
తెలుగు తెరపై విభిన్నమైన పాత్రల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న క్యారెక్టర్ ఆర్టిస్టులలో 'అల్లరి' సుభాషిణి ఒకరు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ .. "మాది భీమవరం .. మొదటి నుంచీ కూడా నాటకాలు అంటే ఇష్టం. అందువలన నా అడుగులు అటువైపే పడిపోయాయి.

స్టేజ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్నాను .. అంతా నన్ను ఆంధ్ర వాణిశ్రీ అనేవారు. అలా ఒకసారి నేను ఒక నాటకం వేస్తుంటే చలపతిరావుగారు చూశారు. ఆ సమయంలో ఆయన కుమారుడు రవి 'అల్లరి' సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలోకి నన్ను తీసుకోమని రవికి చలపతిరావు చెప్పారు. దాంతో భీమవరంలో నా అడ్రెస్ తెలుసుకుని పిలిపించి మరీ, రవి నాతో ఆ వేషం వేయించాడు. ఆ సినిమా నుంచే నన్ను అంతా 'అల్లరి సుభాషిణి' అంటున్నారు" అని చెప్పుకొచ్చారు. 
allari subhashini
ali

More Telugu News