Egypt: కోర్టు తీర్పు వింటూ హాల్లోనే కుప్పకూలి మృతి చెందిన ఈజిప్ట్ మాజీ అధ్యక్షుడు!

  • ప్రజలు ఎన్నుకున్న నేతగా రికార్డు
  • ఎన్నికల్లో గెలిచిన ఏడాదికే జైలు పాలు
  • వివిధ కేసుల్లో జీవిత కాల శిక్ష అనుభవిస్తున్న మాజీ అధ్యక్షుడు

ఈజిప్టు చరిత్రలో తొలిసారిగా ప్రజలు ఎన్నుకున్న అధ్యక్షుడిగా ప్రసిద్ధి చెందిన మాజీ అధ్యక్షుడు మహ్మద్ ముర్సీ (67) కన్నుమూశారు. కోర్టు హాలులో తీర్పు వింటూ కుప్పకూలిన ఆయన మృతి చెందినట్టు ప్రభుత్వ టీవీ చానల్ తెలిపింది. 2013లో పెద్ద ఎత్తున ఆయనకు వ్యతిరేకంగా దేశంలో అల్లర్లు చెలరేగాయి. దీంతో మిలటరీ ఆయనను పదవీచ్యుతిడిని చేసింది. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. పాలస్తీనాకు చెందిన హమాస్‌తో సంబంధాలు, గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న ముర్సి కోర్టు తీర్పు వింటూ కుప్పకూలినట్టు టీవీ చానల్ పేర్కొంది.

2012లో దేశంలో తొలిసారి ప్రజాస్వామ్య బద్దంగా జరిగిన ఎన్నికల్లో దీర్ఘకాలంగా దేశాన్ని పాలించిన హోస్నీ ముబారక్‌ను ఓడించి సంచలనం సృష్టించారు. అయితే, ఏడాదికే ఆయనకు వ్యతిరేకంగా దేశంలో ఆందోళనలు మిన్నంటాయి. దీంతో రంగంలోకి దిగిన మిలటరీ ఆయనను పదవీచ్యుతుడిని చేసింది. ముర్సీ సహా పలువురు నేతలను అరెస్ట్ చేసి జైల్లో పడేసింది. ప్రదర్శనలు నిర్వహిస్తున్న ఆందోళనకారులను చంపించిన కేసులో దోషిగా తేలిన ఆయనకు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్షను విధించింది. అలాగే, గూఢచర్యం కేసులో జీవిత శిక్ష అనుభవిస్తున్నారు.

More Telugu News