KCR: కేసీఆర్‌ది అంతా చౌకబారు రాజకీయం: బీజేపీ నేత లక్ష్మణ్

  • టీఆర్ఎస్‌కు దీ-టుగా నిలిచేది బీజేపీ మాత్రమే
  • కాంగ్రెస్ పార్టీ అంపశయ్యపై ఉంది
  • బీజేపీలో చేరికలు ట్రైలర్ మాత్రమే
దేశంలో కాంగ్రెస్ పార్టీ అంపశయ్యపై ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్‌కు ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదన్నారు. ప్రధాని మోదీ ఎదుట నిలబడేందుకు ముఖం చెల్లకనే కేసీఆర్ నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాలేదని ఎద్దేవా చేశారు.

కేసీఆర్‌దంతా చౌకబారు రాజకీయమని లక్ష్మణ్ విమర్శించారు. టీఆర్ఎస్‌కు దీటుగా నిలిచేది బీజేపీ మాత్రమేనని పేర్కొన్నారు. ప్రస్తుతం బీజేపీలో చేరికలు ట్రైలర్ మాత్రమేనని, అసలైన సినిమా ముందుందన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పెద్ద ఎత్తున చేరికలుంటాయని లక్ష్మణ్ స్పష్టం చేశారు.
KCR
Lakshman
BJP
Congress
Narendra Modi
Neeti Ayog

More Telugu News