YSRCP: సీఎం క్యాంపు కార్యాలయంలో ముగిసిన జగన్-కేసీఆర్ భేటీ

  • ఇద్దరు ముఖ్యమంత్రులు గంటన్నరపాటు చర్చ
  • పెండింగ్ అంశాలు, నీటి వివాదాల పరిష్కారంపై చర్చ
  • ‘కాళేశ్వరం’ ప్రారంభోత్సవానికి రావాలని జగన్ ను ఆహ్వానించిన కేసీఆర్
ఏపీ సీఎం జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ల భేటీ ముగిసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్, కేసీఆర్ ల భేటీ జరిగింది. విభజన అంశాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు గంటన్నరపాటు చర్చించినట్టు సమాచారం. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై, రెండు రాష్ట్రాల మద్య ఉన్న నీటి వివాదాల పరిష్కారంపై, విద్యుత్ ఉద్యోగులు పంపకాలు, విద్యుత్ బిల్లుల బకాయిలపై 9,10 షెడ్యూల్స్ లోని ప్రభుత్వ రంగ సంస్థల విభజన అంశాలపై చర్చించినట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని జగన్ ను కేసీఆర్ ఆహ్వానించారు.

YSRCP
jagan
TRS
kcr
tadepalli
Guntur

More Telugu News