Andhra Pradesh: జగన్ ఇంటికి చేరుకున్న కేసీఆర్.. ఘనంగా స్వాగతం పలికిన ఏపీ ముఖ్యమంత్రి!

  • పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికిన జగన్
  • కేసీఆర్ ను ఆశీర్వదించిన వేదపండితులు
  • కేసీఆర్ ఆహ్వానంపై సానుకూలంగా స్పందించిన జగన్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి జగన్ నివాసానికి చేరుకున్నారు. కుమారుడు కేటీఆర్, ఇతర నేతలతో కలిసి తాడేపల్లిలోని జగన్ నివాసానికి తెలంగాణ సీఎం వచ్చారు. ఆయనకు జగన్, ఇతర వైసీపీ నేతలు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగన్ కు కేసీఆర్ శాలువా కప్పి గౌరవించారు.

ఈ సందర్భంగా జగన్ తో సమావేశమైన కేసీఆర్ ఈ నెల 21న జరిగే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఏపీ సీఎంను ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా హాజరు అవుతున్నట్లు పేర్కొన్నారు. కాగా, కేసీఆర్ ఆహ్వానంపై ఏపీ సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని వైసీపీ వర్గాలు తెలిపాయి. కాగా, ఈ సందర్భంగా కొందరు వేదపండితులు కేసీఆర్ ను ఆశీర్వదించారు.
Andhra Pradesh
Jagan
KCR
kaleswaram
invite

More Telugu News