Andhra Pradesh: మోదీ సైన్యాన్ని ఎదుర్కోలేనని జగన్ వాస్తవం గ్రహించాడు!: జేసీ దివాకర్ రెడ్డి

  • అందుకే ఢిల్లీలో హుందాగా వ్యవహరించారు
  • పాత మిత్రులను కలుసుకునేందుకు అసెంబ్లీకి వచ్చా
  • రేపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగినా వెళతా

ఏపీ అసెంబ్లీలో పాత మిత్రులను కలుసుకునేందుకు తాను శాసనసభ వద్దకు వచ్చానని టీడీపీ నేత, లోక్ సభ మాజీ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. తాను రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నానని స్పష్టం చేశారు. రాజకీయాల నుంచి తప్పుకున్నాక అసెంబ్లీకి రావడంలో విశేషం ఏముందని ప్రశ్నించారు. రేపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగినా వెళతానని చెప్పారు.

అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలో తనకు ఆప్త మిత్రులు ఉన్నారని, వాళ్లను కలుసుకునేందుకే వచ్చానని అన్నారు. సీఎం జగన్ పాలన, పనితీరు ఎలా ఉందో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. అమరావతిలో ఈరోజు అసెంబ్లీ వద్ద జేసీ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ పర్యటనలో జగన్ చాలా హుందాగా వ్యవహరించాడని జేసీ కితాబిచ్చారు. ‘అంతమంది ఉన్న మోదీ సైన్యంతో నేను తలపడలేను అన్న వాస్తవాన్ని గ్రహించి మాట్లాడాడు. కానీ ఢిల్లీకి పోయిన ప్రతీసారి హోదాను అడుగుతూనే ఉంటాను’ అని చెప్పాడన్నారు. 

More Telugu News