Andhra Pradesh: చంద్రబాబుకు ఎయిర్ పోర్టులో తనిఖీలపై అంబటి సెటైర్లు.. నవ్వుల్లో మునిగిపోయిన సీఎం జగన్!

  • టీడీపీ నేతలు నారా నందయ్య శిష్యుల్లా తయారయ్యారు
  • ప్రతీఒక్కరితో మా నాయకుడికి అన్యాయం జరిగిందని చెప్పుకున్నారు
  • వాస్తవానికి మీ వల్లే చంద్రబాబుకు అవమానం జరిగింది
టీడీపీ నేతలు పరమానందయ్య శిష్యుల తరహాలో నారా నందయ్య శిష్యుల్లాగా తయారయ్యారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. దీంతో అసెంబ్లీలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. దీంతో అంబటి స్పందిస్తూ.. టీడీపీ ఎమ్మెల్యేలను అవమానించాలని గానీ, అగౌరపరచాలన్న ఉద్దేశంతో కానీ తాను ఈ వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు.

 చంద్రబాబును గన్నవరం విమానాశ్రయంలో తనిఖీలు చేయగానే టీడీపీ నేతలంతా.. ‘సుబ్బారావు గారు.. మా లీడర్ కు అన్యాయం జరిగిపోయిందండీ. వెంకటరావు గారూ.. మా లీడర్ ను అవమానించారు అండీ.. అంటూ నిద్రపోయేవారిని లేవగొట్టి మరీ చంద్రబాబుకు అన్యాయం జరిగింది అని చెప్పుకున్నారు. అసలు చంద్రబాబుకు అన్యాయం జరగలేదు. అవమానం జరగలేదు. మీరు(టీడీపీ నేతలు) పరమానందయ్య శిష్యులలాగా ప్రతీ చోట ఇలా చెప్పుకోవడం వల్లే ఆయనకు అవమానం జరిగింది’ అని చెప్పారు. దీంతో సభలో ఉన్న ముఖ్యమంత్రి జగన్, ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు నవ్వుల్లో మునిగిపోయారు. 
Andhra Pradesh
Chandrababu
Telugudesam
YSRCP
ambati rambabu

More Telugu News