talasani: 4 సీట్లు గెలవగానే ఎగిరెగిరి పడుతున్నారు: తలసాని

  • స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఎందుకు గెలవలేదు?
  • మేము సస్పెండ్ చేసిన నేతలను బీజేపీలో చేర్చుకుంటున్నారు
  • కాళేశ్వరం పూర్తి కాలేదంటూ కాంగ్రెస్ నేతలు అవాస్తవాలు మాట్లాడుతున్నారు
తెలంగాణ బీజేపీ నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలవగానే బీజేపీ నేతలు ఎగిరెగిరి పడుతున్నారని... స్థానిక ఎన్నికల్లో వారు ఎందుకు గెలవలేకపోయారని ప్రశ్నించారు. తమ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నేతలను బీజేపీలో చేర్చుకుంటున్నారని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తికాలేదంటూ కాంగ్రెస్ నేతలు అసత్యాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో కాళేశ్వరం అంత వేగంగా పూర్తయిన ప్రాజెక్టు మరొకటి లేదని అన్నారు. కాంగ్రెస్ నేతలవి పిచ్చి మాటలంటూ ఎద్దేవా చేశారు. 
talasani
kaleswaram
bjp
congress
TRS

More Telugu News