గుడిలో మద్యం తాగేందుకు వచ్చిన ఆకతాయిలు.. వద్దని చెప్పినందుకు పూజారి హత్య!
- జార్ఖండ్ లోని విష్ణుపురా ప్రాంతంలో ఘటన
- పూజారిగా పనిచేస్తున్న సుందర్ భుయా
- కత్తితో పొడిచి పొదళ్లలో పడవేత
ఆలయ ప్రాంగణంలో ఇలాంటివి వద్దని, అటుగా అటవీప్రాంతానికి వెళ్లాలని సుందర్ భుయా కోరారు. కానీ అప్పటికే మద్యం మత్తులో ఉన్న దుండగులు భుయాతో వాగ్వాదానికి దిగారు. పదునైన కత్తితో ఆయన కడుపులో పొడిచారు. అనంతరం భుయాను సమీపంలోని పొదళ్లో పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. మరుసటిరోజు ఆలయానికి వచ్చిన భక్తులు పూజారి రోదన విని పోలీసులు, అంబులెన్సుకు సమాచారం అందించారు.
అక్కడకు చేరుకున్న పోలీసులు భుయాను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. చనిపోయేముందు భుయా ఇచ్చిన వాంగ్మూలం మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపును ప్రారంభించారు.