Andhra Pradesh: ఇప్పుడు టీడీపీ నేతలు తలకాయను ఎక్కడ పెట్టుకుంటారు అధ్యక్షా?: అంబటి రాంబాబు

  • చంద్రబాబుకు సాధ్యంకాని మెజారిటీ జగన్ కు వచ్చింది
  • ప్రజలు మాపై చాలా గొప్ప బాధ్యతను మోపారు
  • చంద్రబాబు హామీని ఇప్పుడు జగన్ అమలు చేస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రతిపక్ష నేత చంద్రబాబు, టీడీపీ నేతలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఏపీలో, జాతీయ స్థాయిలో చక్రాలు గిరగిరా తిప్పిన వ్యక్తులకు సైతం సాధ్యం కాని అద్భుతమైన మెజారిటీని రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అప్పగించారని అంబటి తెలిపారు. ఏపీ ప్రజలు తమకు 151 సీట్లు ఇచ్చి చాలా పెద్ద బాధ్యతను మోపారని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు ఐదేళ్ల క్రితం బెల్టు షాపులు రద్దుచేస్తున్నట్లు తొలి సంతకం పెట్టారనీ, కానీ అది అమలుకు నోచుకోలేదని విమర్శించారు. ఇప్పుడు  సీఎం వైఎస్ జగన్ ఆ హామీని అమలు చేస్తున్నారని అన్నారు. ‘మీరు ఇచ్చిన హామీని మా నాయకుడు అమలు చేయాల్సిన దౌర్భాగ్యపు పరిస్థితి వచ్చిదంటే వీళ్లు తలకాయను ఎక్కడ పెట్టుకుంటారు అధ్యక్షా?’ అని ప్రశ్నించారు. బెల్టు షాపులే అపలేనివారు మంచి పరిపాలనను ఎలా అందిస్తారని అంబటి నిలదీశారు.

More Telugu News