Crime News: టిష్యూ పేపర్‌ కింద పడిందని పబ్‌లో యువకులపై దాడి : 9 మందికి గాయాలు

  • రెచ్చిపోయి చితగ్గొట్టిన బౌన్సర్లు
  • తొలుత వాగ్వాదం...తర్వాత ఘర్షణ
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు

పబ్‌లోని వాష్‌ రూంలో నాలుగు టిష్యూ పేపర్లు జారి కిందపడిన సందర్భంలో ఏర్పడిన వివాదంలో పలువురి యువకులను అక్కడి బౌన్సర్లు చితగ్గొట్టారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే...పుట్టిన రోజు వేడుకల కోసం కార్తీక్‌రెడ్డి, చంద్రకిరణ్‌రెడ్డి, నవీన్‌శరత్‌చంద్రతో పాటు మరికొందరు యువకులు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అమ్మీషియా పబ్‌కు వెళ్లారు.

వీరిలో కొందరు వాష్‌రూంకి వెళ్లినప్పుడు టిష్యూ పేపర్‌ యూజ్‌ చేస్తుండగా కొన్ని కిందపడ్డాయి. దీన్ని గమనించిన ఓ బౌన్సరు యువకులను ప్రశ్నించాడు. ఈ సందర్భంగా యువకులకు, బౌన్సర్లకు మధ్య వాగ్వాదం జరిగింది. అప్పుడు ఓ బౌన్సర్‌ తిట్టడంతో యువకులు గట్టిగా ప్రశ్నించారు. దీంతో మిగిలిన బౌన్సర్లతో కలిపి వీరిపై అతను దాడిచేసి గాయపరిచాడు. ఈ వివరాలను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. ఈ ఘర్షణలో 9 మందికి తీవ్రగాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన జూబ్లీ హిల్స్‌ పోలీసులు పబ్ యాజమాన్యాన్ని, బౌన్సర్లను ప్రశ్నించినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News