Street Fight: డ్రైవర్‌కు, పోలీసులకు మధ్య వీధి పోరు.. కత్తి తీసిన డ్రైవర్

  • దేశ రాజధానిలో ఆదివారం పట్టపగలు నడిరోడ్డుపై పోరు
  • ఆటో లోంచి డ్రైవర్, అతడి కుమారుడిని కిందికి లాగిన పోలీసులు
  • ముగ్గురు పోలీసుల సస్పెన్షన్ 
ఢిల్లీలో పోలీసులు-టెంపో డ్రైవర్ మధ్య వీధి పోరు జరిగింది. ముఖర్జీ నగర్‌లో ఆదివారం పట్టపగలు జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసుల పాదాలపై నుంచి టెంపో వెళ్లడంతో గొడవ మొదలైంది. ఇది చిలికి చిలికి గాలి వానగా మారింది. పెద్ద ఘర్షణగా మారిపోయింది. దీంతో రెచ్చిపోయిన డ్రైవర్ పోలీసులపైకి కత్తి దూశాడు.

ఈ ఘటనలో ఇద్దరికి గాయాలైనట్టు పోలీసులు తెలిపారు. కాగా, పోలీసులే తనపై తొలుత దాడి చేశారని డ్రైవర్ ఆరోపిస్తున్నాడు. ఈ ఘటనలో అసిస్టెంట్ ఎస్సైలు సంజయ్ మాలిక్, దేవేంద్ర, కానిస్టేబుల్ పుష్పేంద్రలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. పోలీసులే తొలుత ఆటో నుంచి డ్రైవర్, అతడి కుమారుడిని కిందికి లాగినట్టు ఆరోపణలున్నాయి. ఓ పోలీసు అధికారి తలపై టెంపో డ్రైవర్‌ కత్తితో దాడిచేసినట్టు పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
Street Fight
Delhi Cops
Sword

More Telugu News