తిరుమల ఘాట్ లో భక్తులపై చిరుతపులి దాడి!
- కనుమదారిలోని హరిణి వద్ద పిట్టగోడపై కూర్చుని ఉన్న చిరుత
- రెండు వాహనాలపై దాడి.. ఇద్దరికి గాయాలు
- కార్లను చూసి పారిపోయిన చిరుత
ఈ సమయంలో వాహనం వెనుక కూర్చుని ఉన్న పావని అనే యువతి కాలికి గాయమైంది. వారు తప్పించుకుని వేగంగా బండిని నడుపుతూ పైకి ఎక్కేశారు. మరికాసేపటికి అటుగా వచ్చిన మరో బైక్ పైనా చిరుత దాడి చేసి, యామిని అనే మరో యువతిని గాయపరిచింది. అదే సమయంలో కొన్ని కార్లు రావడంతో, వాటిని చూసిన చిరుత పారిపోగా, భక్తులు తప్పించుకోగలిగారు. గాయపడిన వారికి తిరుమల అశ్విని ఆసుపత్రిలో చికిత్స అందించారు.