Guntur District: రేపు దీక్ష విరమించనున్న స్వరూపానందేంద్ర సరస్వతి

  • తాడేపల్లిలోని ఆశ్రమంలో ఏర్పాట్లు
  • రేపు ఉత్తరాధికారిగా ప్రవీణ్ కుమార్ శర్మకు బాధ్యతలు
  • హాజరుకానున్న గవర్నర్, సీఎంలు
శారదా పీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి రేపు దీక్ష విరమించనున్నారు. తాడేపల్లిలోని గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో దీక్ష విరమణకు సంబంధించి అన్ని ఏర్పాటు చేశారు.  రేపు ఉదయం 11 గంటలకు ఉత్తరాధికారిగా ప్రవీణ్ కుమార్ శర్మ బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా, గత రెండు రోజులుగా ఉత్తరాధికారి బాధ్యతల స్వీకరణ నిమిత్తం ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. రేపు చివరి రోజు కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. రేపు సాయంత్రం 5.50 గంటలకు సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించనున్నారు.
Guntur District
Tadepalli
swarupanandendra

More Telugu News