Andhra Pradesh: ఆంధ్రాలో నాటుసారా స్థావరాలను ధ్వంసం చేస్తాం!: ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామి

  • ఏపీలో సంపూర్ణ మద్య నిషేధం అమలుచేస్తాం
  • ఇందుకోసం కొత్త పాలసీని తీసుకొస్తాం
  • అమరావతిలో మీడియాతో ఏపీ ఎక్సైజ్ మంత్రి
విశాఖపట్నం ఏజెన్సీ కేంద్రంగా గంజాయి రవాణా సాగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి తెలిపారు. దీన్ని అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మద్యపాన నిషేధంపై పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని అన్నారు. ఇందులో భాగంగా మొదట బెల్టు షాపులు ఎత్తివేస్తామని ప్రకటించారు.

అమరావతిలో ఎక్సైజ్ అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. పొరుగు రాష్ట్రాల్లోని మద్యం విధానాలను పరిశీలించి కొత్త పాలసీ తీసుకొస్తామని నారాయణ స్వామి తెలిపారు. మద్యాన్ని దశలవారీగా నిషేధిస్తామని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో నాటు సారా స్థావరాలను ధ్వంసం చేస్తామని పేర్కొన్నారు.
Andhra Pradesh
narayana swamy
excise minister
liquor ban
weed
Visakhapatnam agency

More Telugu News