Andhra Pradesh: నేను ప్రతిపాదించిన ప్రాజెక్టు అందుబాటులోకి రావడం చాలా సంతోషంగా ఉంది!: వెంకయ్యనాయుడు

  • కృష్ణపట్నం – ఓబులవారి పల్లె రైల్వేలైన్ ప్రారంభం
  • వాజ్ పేయి హయాంలో ప్రతిపాదించిన వెంకయ్య
  • ఆర్వీఎన్ఎల్, రైల్వే శాఖకు ఉపరాష్ట్రపతి ధన్యవాదాలు
అటల్ బిహారీ వాజ్ పేయి హయాంలో కృష్ణపట్నం – ఓబులవారి పల్లె రైల్వే లైన్ ప్రాజెక్టును తాను ప్రతిపాదించానని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తిచేసిన రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్(ఆర్వీఎన్ఎల్), రైల్వే శాఖలకు అభినందనలు చెప్పారు.

ఈ లైన్ లో రైల్వేశాఖ డీజిల్ ఇంజిన్ తో ట్రయల్ రన్ నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఈ నెల 20 నుంచి ఈ రూట్ లో ఎలక్ట్రిక్ రైలు అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. తాను ప్రతిపాదించిన ప్యాసింజర్ రైలును త్వరితగతిన ఏర్పాటు చేసినందుకు రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ సంస్థకు మరోసారి ధన్యవాదాలు చెప్పారు.
Andhra Pradesh
Venkaiah Naidu
vice president
Twitter

More Telugu News