G. Nageswar Reddy: సినిమా షూటింగ్‌లో గాయపడిన హీరో సందీప్ కిషన్.. వీడియో వైరల్

  • బాంబ్ బ్లాస్ట్‌ను చిత్రీకరిస్తుండగా ప్రమాదం
  • ఆసుపత్రికి తరలించిన చిత్రబృందం
  • వీడియోను అభిమానులతో పంచుకున్న సందీప్
యువ కథానాయకుడు సందీప్ కిషన్ నేడు షూటింగులో గాయపడ్డాడు. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘తెనాలి రామకృష్ణ’ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం కర్నూలులో జరుగుతోంది. ఈ సందర్భంగా నేడు ఓ సన్నివేశంలో భాగంగా బాంబ్ బ్లాస్ట్‌ను చిత్రీకరిస్తుండగా జరిగిన ప్రమాదంలో సందీప్ కిషన్ గాయపడ్డాడు.

వెంటనే అతడిని చిత్ర బృందం చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించింది. ఫైట్ మాస్టర్ సమన్వయ లోపమే ప్రమాదానికి కారణమని చిత్రబృందం తెలిపింది. ప్రాథమిక చికిత్స అనంతరం సందీప్‌ను హైదరాబాద్ తరలించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోను సందీప్ కిషన్ అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
G. Nageswar Reddy
Sandeep Kishan
Fight Master
Shooting
Accident

More Telugu News