Ruya Hospital: రుయా ఆసుపత్రిలో దారుణం.. స్ట్రెచర్ అందుబాటులో లేక వ్యక్తి మృతి

  • జ్వరంతో ఆసుపత్రిలో చేరిన వ్యక్తి
  • ఐసీయూకు తరలించాలని సూచించిన వైద్యులు
  • అరగంట పాటు వేచి చూసినా దొరకని స్ట్రెచర్
స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. జ్వరంతో రుయా ఆసుపత్రిలో చేరిన ఓ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నేడు విషమించడంతో జనరల్ వార్డు నుంచి అత్యవసర వార్డుకు తరలించాలని వైద్యులు సూచించారు. అయితే స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో రోగి బంధువులు అరగంట పాటు వేచి చూశారు.

అయినా స్ట్రెచర్ దొరకక పోవడంతో పరిస్థితిని అర్థం చేసుకున్న ఓ వ్యక్తి స్ట్రెచర్‌ను తీసుకొచ్చి ఇచ్చాడు. అత్యవసర విభాగానికి తరలిస్తుండగానే రోగి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో రోగి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. అయితే మౌలిక వసతుల లేమిపై నేటి ఉదయం చిత్తూరు కలెక్టర్ భరత్ నారాయణ్ గుప్తా తనిఖీలు చేసి వెళ్లారు. ఆయన వెళ్లిన కొద్దిసేపటికే ఈ విషాదం చోటు చేసుకుంది.
Ruya Hospital
Tirupathi
Bharath Narayan Gupta
Strecher
ICU

More Telugu News