nimmala ramanayudu: పశ్చిమగోదావరి జిల్లాలో రాయలసీమ తరహా దాడులు మొదలయ్యాయి: టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు

  • ప్రశాంతంగా ఉన్న జిల్లాలో పరిస్థితులు మారిపోతున్నాయి
  • వైసీపీ పాలనకు దశ, దిశ లేదు
  • ప్రజల దృష్టిని మరల్చేందుకు మైండ్ గేమ్ ఆడుతున్నారు
ఇంతకాలం ప్రశాంతంగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలో పరిస్థితులు మారిపోతున్నాయని... రాయలసీమ తరహా దాడులు మొదలయ్యాయని పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ సానుభూతిపరులను టార్గెట్ చేసుకుని దాడులకు తెగబడుతున్నారని... తాము చూస్తూ ఊరుకోబోమని అన్నారు. గత 15 రోజుల వైసీపీ పాలనలో ప్రచార ఆర్భాటం తప్ప మరేమీ కనిపించలేదని... పాలనలో ఒక దశ, దిశ లేదని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక... ప్రజల దృష్టిని మరల్చేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోందని అన్నారు. వైసీపీతో టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరూ టచ్ లో లేరని చెప్పారు.
nimmala ramanayudu
Telugudesam
ysrcp

More Telugu News