సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కోరా!: అమిత్ షాతో భేటీపై జగన్
- సహాయ సహకారాలు కోరా
- ప్రత్యేక హోదా కోరుతూ లేఖను అందించా
- ఇప్పటికే నివేదిక కూడా సిద్ధం
ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ రాసిన లేఖను అమిత్‌షాకు అందించినట్టు జగన్ తెలిపారు. రేపు జరగబోయే నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంలోనూ ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తనున్నట్టు జగన్ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా అంశంపై వివరించేందుకు ఇప్పటికే నివేదికను కూడా జగన్ సిద్ధం చేయించారు.