మహారాష్ట్ర సీఎంని కలసిన కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానం
- ఫడ్నవీస్‌ను శాలువాతో సన్మానించిన కేసీఆర్
- మహారాష్ట్ర సహకారం మరువలేనిదని వెల్లడి
- ఒప్పందం కారణంగానే త్వరితగతిన పూర్తి
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మహారాష్ట్ర సహకారం మరువలేనిదని, ఆ రాష్ట్రంతో కుదుర్చుకున్న ఒప్పందం కారణంగానే త్వరితగతిన పూర్తయిందని ఈ సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నారు. ఫడ్నవీస్‌ను శాలువాతో సన్మానించారు. జయశంకర్ భూపాలపల్లిలోని కన్నెపల్లి వద్ద నిర్మితమైన ఈ ప్రాజెక్టును ఈ నెల 21న ఉదయం 10:30 గంటలకు ప్రారంభించనున్నారు.