Congress: కాళేశ్వరం ప్రారంభోత్సవానికి జగన్ వస్తే వైఎస్ జలయజ్ఞాన్ని తప్పుబట్టినట్టే: భట్టి విక్రమార్క

  • ప్రాణహిత-చేవెళ్ల ప్రాజక్టును వైఎస్ మొదలుపెట్టారు
  • దాన్ని కాళేశ్వరం ప్రాజక్టుగా రీడిజైన్ చేశారు
  • పార్టీ ఫిరాయింపులపై జగన్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం
అనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదలుపెట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజక్టును కాళేశ్వరం ప్రాజక్టుగా రీడిజైన్ చేశారంటూ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజక్టు ప్రారంభోత్సవానికి జగన్ వస్తే తన తండ్రి వైఎస్ చేపట్టిన జలయజ్ఞాన్ని తప్పుబట్టినట్టేనని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రారంభోత్సవానికి పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్న నేతలెవరూ కనిపించడంలేదా? అంటూ మండిపడ్డారు. కాళేశ్వరం డీపీఆర్ ను ఇంతవరకు శాసనసభలో ప్రవేశపెట్టలేదని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అవినీతిపై ప్రశ్నిస్తారన్న కారణంతోనే ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నామని అన్నారు. .
Congress
Mallu Bhatti Vikramarka
Jagan
TRS
Telangana

More Telugu News