Telangana: టీఆర్ఎస్ లో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలకు భద్రత పెంపు

  • టీఆర్ఎస్ లో చేరిన తాండూరు, కొల్లాపూర్ ఎమ్మెల్యేలు
  • ఇరువురిపై నియోజకవర్గాల్లో వ్యతిరేకత
  • భద్రత పెంచాలని విజ్ఞప్తి
తెలంగాణలో ఇద్దరు శాసనసభ్యులకు భద్రత పెంచారు. ఇటీవలే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న తాండూరు, కొల్లాపూర్ ఎమ్మెల్యేలకు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, కొల్లాపూర్ శాసనసభ్యుడు హర్షవర్ధన్ రెడ్డి వారి వారి నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు.

ఈ మేరకు ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ, తమకు ప్రస్తుతం ఉన్న భద్రత సరిపోదని తెలిపారు. ఈ నేపథ్యంలో, తెలంగాణ సర్కారు ఇద్దరు ఎమ్మెల్యేలకు అదనంగా మరికొంతమంది గన్ మన్లను కేటాయించింది. కాంగ్రెస్ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి టీఆర్ఎస్ లోకి ఫిరాయించిన శాసనసభ్యుల్లో పైలట్ రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి కూడా ఉన్నారు.
Telangana
TRS
Congress

More Telugu News