Andhra Pradesh: హైదరాబాద్ లో ‘ట్రాన్స్ ఫ్యూజన్ కేర్ సెంటర్’ను ప్రారంభించిన నారా భువనేశ్వరి!

  • తలసేమియా చిన్నారులకు రక్తం సరఫరా
  • 80 మందిని దత్తత తీసుకున్న ఎన్టీఆర్ ట్రస్ట్
  • ఏపీ, తెలంగాణలో తలసేమియా చిన్నారులకు రక్తం సరఫరా

తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు రక్తం సరఫరా కోసం ట్రాన్స్ ఫ్యూజన్ కేర్ సెంటర్ ను టీడీపీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి ప్రారంభించారు. నగరంలోని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన్ లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులతో నారా భువనేశ్వరి కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చాలామంది చిన్నారులు నిరంతరం రక్తం సరఫరా అందక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.

ఈ చిన్నారులకు సాయం అందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుకు వచ్చిందనీ, తమ వంతు సాయం చేస్తోందని వ్యాఖ్యానించారు. ఏపీ, తెలంగాణలో తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా రక్తాన్ని సరఫరా చేస్తున్నామనీ, ఈ విషయంలో తాము గర్వపడుతున్నామని భువనేశ్వరి పేర్కొన్నారు. రక్తదాన శిబిరాల ద్వారా సేకరించిన రక్తంలో 30 శాతాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులకు అందజేస్తున్నామనీ, తద్వారా ప్రమాదాల్లో గాయపడేవారికి సత్వరం చికిత్స అందించడం వీలవుతుందని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియాతో బాధపడుతున్న 80 మందిని దత్తత తీసుకుందని చెప్పారు.

  • Loading...

More Telugu News