kIA Motors: జూలై తర్వాత పెనుకొండ కియా ప్లాంట్ నుంచి తొలి కారు విడుదల

  • నోయిడాలో తొలి షోరూం ఏర్పాటు చేసిన కియా మోటార్స్
  • రెడ్ క్యూబ్ పేరుతో దేశవ్యాప్తంగా షోరూంలు
  • ఏటా 3 లక్షల కార్ల ఉత్పాదనే లక్ష్యం

ఏపీలో ఏర్పాటైన కియా కార్ల పరిశ్రమ నుంచి తొలికారు జూలై తర్వాత మార్కెట్లోకి రానుంది. గత ప్రభుత్వ హయాంలో అనంతపురం జిల్లా పెనుకొండలో ప్రతిష్ఠాత్మక కియా కార్ల ఫ్యాక్టరీ ఏర్పాటైంది. దక్షిణకొరియా కార్ల తయారీ దిగ్గజం కియా మోటార్స్ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో అమ్మకాలు సాగిస్తోంది. తాజాగా, భారత్ లో కూడా మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేసిన కియా ఇప్పుడు మార్కెట్ వృద్ధి చేసుకోవడంపై దృష్టిపెట్టింది.

ఈ క్రమంలో తొలి షోరూమ్ ను నోయిడాలో ఏర్పాటు చేసింది. 'రెడ్ క్యూబ్' పేరుతో కార్ల షోరూమ్ లను దేశవ్యాప్తంగా విస్తరించాలని కియా మోటార్స్ యాజమాన్యం నిర్ణయించింది. ఇప్పటికే పెనుకొండ ప్లాంట్ లో కార్ల తయారీ ఊపందుకుంది. అన్నివిధాలుగా ముస్తాబైన తొలి కియా కారు భారత రోడ్లపై వచ్చే నెలలో పరుగులు తీసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా, పెనుకొండ ప్లాంట్ నుంచి ఏటా 3 లక్షల కార్లను ఉత్పత్తి చేయాలని సంస్థ భావిస్తోంది.

More Telugu News