Gorantla Butchaiah Chowdary: ముందుగా జగన్ ప్రతిపక్షాలపై విమర్శల కార్యక్రమం మొదలు పెట్టారు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శలు
- సభ వివాదం కావడానికి కారకులెవరు?
- ఎమ్మెల్యేలు సైతం యుద్ధానికి సిద్ధమయ్యారు
- మేము హూందాగా వ్యవహరించాం
- చంద్రబాబుకు సభలో గౌరవమివ్వలేదు
నేడు జరిగిన ఏపీ అసెంబ్లీ తీరుపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. ఓ ఛానల్‌తో ఆయన మాట్లాడుతూ, స్పీకర్ అభినందన సభ వివాదం కావడానికి కారకులెవరని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ ముందుగా స్పీకర్ అభినందన కంటే అభిశంసనలా ప్రతిపక్షాలపై విమర్శల కార్యక్రమం మొదలు పెట్టారన్నారు. జగన్‌తో పాటు ఎమ్మెల్యేలు సైతం యుద్ధానికి సిద్ధమయ్యారని, తాము మాత్రం హూందాగా వ్యవహరించామన్నారు.
అసలు ప్రతిపక్షం లేకుండా స్పీకర్ ఎన్నిక ఎలా ఏకగ్రీవమవుతుందని బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. చిన్న విషయాన్ని భూతద్దంలో చూపించేలా జగన్ వ్యవహరించారని విమర్శించారు. చంద్రబాబుకు సభలో గౌరవమివ్వలేదని, సీఎంను ఎలా పిలిచారో, అదే విధంగా ప్రతిపక్షాన్ని కూడా ప్రోటెం స్పీకర్ పిలవాలని పేర్కొన్నారు. ఎందరో బలహీన వర్గాల వారిని స్పీకర్లను చేసిన ఘనత చంద్రబాబుదేనని బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు.