RKRoja: ఏపీఐఐసీ చైర్మన్ నేనా...ఏమో నాకు సమాచారం లేదు: ఎమ్మెల్యే రోజా

  • అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియాకు స్పష్టీకరణ
  • జగన్‌ ఏ పదవి ఇచ్చినా సంతోషంగా స్వీకరిస్తాను
  • ఆయనకు మంచి పేరు తెచ్చే ప్రయత్నం చేస్తా

ఏపీఐఐసీ చైర్మన్‌గా నగరి ఎమ్మెల్యే ఆర్‌.కె.రోజాను నియమించేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అంగీకరించారన్న వార్తల నేపథ్యంలో ‘ఏమో నాకైతే ఎటువంటి సమాచారం లేదు’ అంటూ రోజా మీడియా ప్రతినిధులకు షాకిచ్చారు. రోజాకు మంత్రివర్గంలో కచ్చితంగా చోటు దక్కుతుందని భావించినప్పటికీ, ఆమెకు ఆ అవకాశం రాలేదు. దీంతో ఆమె అలకపాన్పు ఎక్కారన్న వార్తలు గుప్పుమన్నాయి.

ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు ఒక రోజు ముందు ఆమె సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు ఏపీఐఐసీ చైర్మన్‌ పదవి ఇవ్వనున్నట్టు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఈరోజు రెండో రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరైన రోజా ఇలా వ్యాఖ్యానించడంతో మీడియా ప్రతినిధులు అవాక్కయ్యారు. అయితే  ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తనకు ఏ పదవి ఇచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. తనకు అప్పగించిన బాధ్యతలు చిత్తశుద్ధితో నిర్వహించి ఆయనకు మంచి పేరు తీసుకొస్తానని రోజా చెప్పారు.

More Telugu News