vidadala rajani: యువకుడిని ఢీకొన్న వైసీపీ ఎమ్మెల్యే రజనీ వాహనం

  • చిలకలూరిపేట నుంచి అసెంబ్లీకి వస్తుండగా ప్రమాదం
  • బైక్ ను ఢీకొన్న ఎమ్మెల్యే వాహనం
  • యువకుడిని ఆసుపత్రికి తరలించిన రజనీ సహాయకుడు

చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీ ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఆమె ప్రయాణిస్తున్న కారు ఓ బైక్ ను ఢీకొంది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న ఓ యువకుడు గాయపడ్డాడు. వెంటనే స్థానికుల సహకారంతో సదరు యువకుడిని ఎమ్మెల్యే సహాయకుడు దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు. చిలకలూరిపేట నుంచి అమరావతిలోని అసెంబ్లీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరోవైపు, అసెంబ్లీ సమావేశాలు ఈరోజు రెండో రోజుకు చేరుకున్నాయి.

More Telugu News