Congress: 2022లో మీరే సీఎం అభ్యర్థి కావాలి: ప్రియాంకగాంధీని కోరిన యూపీ కాంగ్రెస్ నేతలు

  • యూపీలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలంటూ ప్రియాంకను కోరిన నేతలు
  • ప్రియాంక ప్రచారంలోకి దిగితే అధికారం తమదేనని ధీమా
  • ఇకపై ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయం

కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీపై ఉత్తరప్రదేశ్ నేతల అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. ఇందుకు గల కారణాలను విశ్లేషించేందుకు రాయబరేలీలో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. 2022లో యూపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక సీఎం అభ్యర్థి అయితే బాగుంటుందని ఈ సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి రాష్ట్రంలో పార్టీ బలహీనపడడమే కారణమన్న నేతలు భవిష్యత్తులో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ రాజేశ్ మిశ్రా మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఉప ఎన్నికలు, అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను బలోపేతం చేయాల్సిందిగా ప్రియాంకను కోరినట్టు తెలిపారు. బీజేపీని ఎదుర్కొనేందుకు ఆమే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండాలని కూడా కోరినట్టు పేర్కొన్నారు. అలాగే, ఇకపై ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పుకొచ్చారు. ప్రియాంక కనుక ‘డోర్ టు డోర్’ ప్రచారం చేస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని మిశ్రా ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News