Kotamreddy: కోటంరెడ్డి 'క్రీమ్ రాస్తా' అంటే... నవ్వుతూ వెళ్లిపోయిన బుచ్చయ్యచౌదరి!

  • నిన్న అసెంబ్లీలో తారసపడ్డ గోరంట్ల, కోటంరెడ్డి
  • ఇద్దరి మధ్యా ఆసక్తికర సంభాషణ
  • తిట్టిన తిట్లకు క్రీమ్ రాసి మరీ వడ్డిస్తానన్న కోటంరెడ్డి
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు బుధవారం నాడు వెలగపూడి అసెంబ్లీలో ప్రారంభమైన వేళ, ఓ ఆసక్తికరమైన సన్నివేశం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అసెంబ్లీకి వచ్చిన వేళ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి కలిశారు. "‘బుచ్చన్నా... బాగున్నావా?" అంటూ కోటంరెడ్డి ఆయన్ను పలకరించారు. ఆ వెంటనే గోరంట్ల ఎమ్మెల్యేగా గెలిచిన కోటంరెడ్డికి అభినందనలు తెలిపారు.

అయితే, అంతటితో వదలని కోటంరెడ్డి, "అన్నా... మీరు ఐదేళ్లు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు మేము వచ్చాము. అధికార పక్ష ఎమ్మెల్యేలుగా మేము ఎలా నడచుకోవాలో చెప్పండి?" అని అడిగారు. దీనికి బుచ్చయ్యచౌదరి నుంచి చిరునవ్వే సమాధానమైంది. అంతటితోనూ వదలని కోటంరెడ్డి, "అన్నా, అసెంబ్లీలో రికార్డు పుస్తకాలు తెప్పించాను. గతంలో ప్రతిపక్షాన్ని మీరెన్ని తిట్లు తిట్టారో చూస్తాను. వాటికి మరింత క్రీమ్‌ రాసి ఈ ఐదేళ్లూ మీపై వదులుతాం" అని సరదాగా అంటే అక్కడ నవ్వులు విరిశాయి.
Kotamreddy
Gorantla Butchaiah Chowdary
Assembly

More Telugu News