Tollywood: కొండగట్టు అంజన్న ఆలయంలో సినీ దర్శకుడు బి.గోపాల్, సంగీత దర్శకుడు కోటి ప్రత్యేక పూజలు

  • అంజన్న, లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు
  • సన్మానించిన ఆలయ సిబ్బంది
  • చూసేందుకు ఎగబడిన జనం
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన కొండగట్టు, ధర్మపురి ఆలయాల్లో తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు బి.గోపాల్, సంగీత దర్శకుడు కోటి బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆలయాన్ని తొలుత దర్శించుకున్న వీరిద్దరూ ఆంజనేయ స్వామికి పూజలు చేశారు. అనంతరం ధర్మపురి చేరుకుని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారిని ఆలయ అర్చకులు సాదరంగా ఆహ్వానించారు. పూజా కార్యక్రమాల అనంతరం వారిని సన్మానించారు. కాగా, వీరిని చూసేందుకు భక్తులు ఎగబడ్డారు.
Tollywood
B.Gopal
Koti
Kondagattu
Dharmapuri
Telangana

More Telugu News