Kunthiya: టీఆర్ఎస్‌లోకి వెళుతున్న ఎమ్మెల్యేలకు నాడు ఆ విషయం తెలియదా?: కుంతియా

  • కవిత ఓటమే ప్రజల్లో వ్యతిరేకతను చెబుతోంది
  • పదవులకు రాజీనామా చేసి పార్టీ మారాలి
  • వ్యక్తిగత లాభాల కోసమే టీఆర్ఎస్‌లో చేరారు
కాంగ్రెస్ పార్టీపై నమ్మకం లేక టీఆర్ఎస్‌లోకి వెళ్లామని చెబుతున్న ఎమ్మెల్యేలకు నాడు టికెట్ అడిగిన రోజున ఆ విషయం తెలియదా? అని తెలంగాణ ఇన్‌చార్జి కుంతియా ప్రశ్నించారు. నేడు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, స్వయానా కేసీఆర్ కూతురు కవిత ఎన్నికల్లో ఓడిపోయిందంటే టీఆర్ఎస్‌పై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. తమ పదవులకు రాజీనామా చేసిన అనంతరమే ఎమ్మెల్యేలు పార్టీ మారాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్‌లో చేరడం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పద్ధతి కాదన్నారు. వ్యక్తిగత లాభాల కోసమే ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరారని విమర్శించారు.  
Kunthiya
Delhi
TRS
Congress
MLA
Kavitha

More Telugu News