siddhipet: సిద్దిపేటలో భారీగా నకిలీ పత్తి విత్తనాల పట్టివేత!

  • మాదారం, శాకారం గ్రామాల్లో నకిలీ విత్తనాలు
  • వీటి విలువ రూ.34 లక్షలు
  • ఏడుగురు నిందితుల అరెస్టు

సిద్దిపేట జిల్లాలో భారీగా నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. వర్గల్ మండలంలోని మాదారం, శాకారం గ్రామాల్లో వ్యవసాయ శాఖ విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. రూ.34 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఏడుగురిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఎస్పీ అన్నపూర్ణ మాట్లాడుతూ, మూడు సంచుల లూజ్ విత్తనాలను సీజ్ చేశామని చెప్పారు. నిందితులు కిలో పత్తి విత్తనాలు రూ.1600కు కొనుగోలు చేసి, రూ.1800లకు విక్రయిస్తున్నారని అన్నారు. కర్నూలు, గుంటూరు నుంచి లూజ్ విత్తనాలను కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకొచ్చి విక్రయిస్తున్నారని చెప్పారు. లూజ్ విత్తనాలను రైతులు కొనుగోలు చేయొద్దని సూచించారు. నకిలీ విత్తనాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్టు అన్నపూర్ణ తెలిపారు.

More Telugu News