sandeep vanga: సందీప్ వంగాతో మహేశ్ మూవీ లేనట్టే!

  • మహేశ్ తో చేయాలనుకున్న సందీప్ వంగా
  •  వంశీ పైడిపల్లికే మళ్లీ ఛాన్స్ ఇచ్చిన మహేశ్
  •  అనిల్ రావిపూడి మూవీ తరువాత ప్రాజెక్టు ఇదే    

'అర్జున్ రెడ్డి' సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న సందీప్ రెడ్డి వంగా, అదే సినిమాను హిందీలో 'కబీర్ సింగ్' టైటిల్ తో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన మహేశ్ బాబుతో కలిసి సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపించింది. ఈ లోగా మహేశ్ బాబు .. అనిల్ రావిపూడి సినిమాను పూర్తి చేసేస్తాడని అన్నారు.

అయితే అనిల్ రావిపూడి తరువాత సినిమాను వంశీ పైడిపల్లితోనే చేయాలని మహేశ్ బాబు డిసైడై పోయాడట. ఆ విషయం వంశీ పైడిపల్లికి ఆయన స్పష్టంగా చెప్పడం .. అందుకు సంబంధించిన కథపై వంశీ పైడిపల్లి కసరత్తు చేయడం మొదలైందని సమాచారం. అందువలన ఇప్పట్లో సందీప్ వంగాతో సినిమా లేనట్టేనని అంటున్నారు. మహేశ్ నుంచి కబురు రాకపోవడంతో కుదిరితే మరో హిందీ మూవీ .. లేదంటే మరో హీరోతో తెలుగు సినిమా చేసే ఆలోచనలో సందీప్ వంగా వున్నాడట. 

  • Loading...

More Telugu News