YSRCP: 'జగన్ సాక్షిగా కాదు, దైవసాక్షిగా అనాలి'... కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో రెండోసారి ప్రమాణం చేయించిన ప్రోటెం స్పీకర్

  • తొలిసారి సమావేశమైన ఏపీ నూతన అసెంబ్లీ
  • ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించిన ప్రోటెం స్పీకర్
  • అసెంబ్లీ రేపటికి వాయిదా

ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఇవాళ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రోటెం స్పీకర్ అప్పలనాయుడు ప్రమాణస్వీకారం చేయించారు. సాధారణంగా పదవీప్రమాణంలో 'దైవసాక్షిగా' అనే పదాన్ని వాడతారు. కానీ, నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన వంతు రాగానే, "దైవసాక్షిగా, మరియు నా ఆరాధ్య నాయకుడు జగన్ సాక్షిగా" అంటూ కొనసాగించారు.

దాంతో ప్రోటెం స్పీకర్ అప్పలనాయుడు అభ్యంతరం చెప్పారు. శ్రీధర్ రెడ్డిగారు తప్పుగా పలికారు, ఆయన మళ్లీ ప్రమాణం చేస్తారు అంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేతో మరోసారి ప్రమాణం చేయించారు. ఈసారి "దైవసాక్షిగా" అని మాత్రమే పలికించారు. కాగా, సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం అనంతరం ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదాపడింది.

  • Loading...

More Telugu News