chandrababu: ఆరు నెలలు మౌనంగా ఉందామనుకున్నాం... కానీ, అనవసరం అనిపిస్తోంది: చంద్రబాబు

  • టీడీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు
  • తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమాలు మొదలయ్యాయి
  • టీడీపీ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దు
తొలి రోజు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లబోయేముందు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో, వారికి సహకరిస్తూ ఆరు నెలల పాటు మౌనంగా ఉండాలని తొలుత అనుకున్నామని.... కానీ, టీడీపీ కార్యకర్తలపై దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్నారని... అందుకే వైసీపీకి సమయం ఇవ్వడం అనవసరమని అనిపిస్తోందని చెప్పారు. టీడీపీ కార్యకర్తలపై బురద చల్లే కార్యక్రమాలు, తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమాలు మొదలయ్యాయని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నామని టీడీపీ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దని సూచించారు. టీడీపీ ప్రజాప్రతినిధులు ప్రతి అంశాన్ని అధ్యయనం చేసి, అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పారు.
chandrababu
Telugudesam
ysrcp

More Telugu News