Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన విశాఖ డ్వాక్రా ఆర్ఫీలు!

  • ఆర్పీల వేతనాలను రూ.10 వేలు చేసిన జగన్
  • హర్షం వ్యక్తం చేసిన రిసోర్స్ పర్సన్స్
  • సీఎం తమ కష్టాన్ని గుర్తించారని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ లో డ్వాక్రా రిసోర్స్ పర్సన్(ఆర్పీ)లకు కనీస వేతనాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ రూ.10,000 చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై పలువురు ఆర్పీలు హర్షం వ్యక్తం చేశారు. తాజాగా విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జగన్ బ్యానర్ కు పాలాభిషేకం చేశారు.

ఈ విషయమై ఓ ఆర్పీ మాట్లాడుతూ.. తమకు ఏదో నామమాత్రంగా వేతనాలు ఇచ్చేవారనీ, ఫిక్స్ డ్ జీతాలు అంటూ లేవని వాపోయారు. కానీ ఏపీ నూతన ముఖ్యమంత్రి జగన్ తమ వేతనాలను రూ.10,000 చేసి ఆదుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. తమకు ప్రత్యేకంగా వేతనాలు అంటూ లేకున్నా ముఖ్యమంత్రి తమ కష్టాన్ని గుర్తించారని అన్నారు.
Andhra Pradesh
Jagan
Chief Minister
rp
salary hikes

More Telugu News