Vishal: నడిగర్ సంఘం స్థల వివాదం కేసులో.. పోలీసుల విచారణకు హాజరైన హీరో విశాల్!

  • కాంచీపురంలో నడిగర్ సంఘానికి స్థలం
  • విక్రయంలో అవకతవకలు జరిగాయని ఫిర్యాదు
  • పోలీసులను కలిసి వివరాలు అందించిన విశాల్
నడిగర్‌ సంఘం స్థల విక్రయ వివాదంలో, ఆ సంఘం కార్యదర్శి, హీరో విశాల్‌ కాంచీపురం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యాడు. కాంచీపురం ప్రాంతంలో నడిగర్ సంఘానికి 26 సెంట్ల స్థలం ఉండగా, దాన్ని మాజీ అధ్యక్ష, కార్యదర్శులు శరత్ కుమార్, రాధారవిలు విక్రయించారని, ఈ డీల్ లో అవకతవకలు జరిగాయని విశాల్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఈ కేసును విచారించాలని న్యాయమూర్తి కాంచీపురం పోలీసులను ఆశ్రయించగా, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని, విచారణకు రావాలని విశాల్ కు నేర పరిశోధనా విభాగం పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయన పోలీసుల ఎదుటకు వచ్చి స్థల విక్రయానికి సంబంధించిన వివరాలను అందించాడు.
Vishal
Chennai
Kanchipuram
Police

More Telugu News