Andhra Pradesh: శాసన మండలి టీడీపీ పక్ష నేతగా యనమల రామకృష్ణుడు

  • ముగిసిన ఏపీ టీడీఎల్పీ సమావేశం  
  • ఉప నేతలుగా అచ్చెన్నాయుడు, గోరంట్ల, రామానాయుడు
  • విప్ గా బాలవీరాంజనేయస్వామి నియామకం
ఏపీ టీడీఎల్పీ సమావేశం ముగిసింది. శాసనసభలో టీడీపీ ఉపనేతలను టీడీపీ ఎల్పీ నేత చంద్రబాబు ఖరారు చేశారు. శాసనసభలో టీడీపీ ఎల్పీ ఉప నేతలుగా అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రామానాయుడు, విప్ గా బాలవీరాంజనేయస్వామిని నియమించారు.

అదే విధంగా, శాసనమండలిలో టీడీపీ పక్ష నేతగా యనమల రామకృష్ణుడు, ఉపనేతలుగా డొక్కా సంధ్యారాణి, జి.శ్రీనివాసులు, విప్ గా బుద్ధా వెంకన్నను నియమించారు. శాసనమండలిలో టీడీపీకే బలం ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. శాసనసభ, శాసనమండలి సభ్యులు సమన్వయంతో పని చేయాలని పార్టీ నాయకులకు సూచించారు.
Andhra Pradesh
Chandrababu
Telugudesamlp
gorantal

More Telugu News